Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకున్న స్వాతి నాయుడు.. వీడియో చూడండి

  • అవినాశ్ అనే వ్యక్తిని పెళ్లాడిన స్వాతి నాయుడు
  • విజయవాడలోని టింబర్ మర్చంట్ ఛాంబర్ లో వివాహం
  • తన భర్త, తండ్రిని అభిమానులకు పరిచయం చేసిన స్వాతి
పలు శృంగార వీడియోలతో యూట్యూబ్ ద్వారా పాప్యులర్ అయిన స్వాతి నాయుడు (స్వాతి బిందు) వివాహబంధంలోకి అడుగుపెట్టింది. విజయవాడలోని టింబర్ మర్చంట్ ఛాంబర్ లో అవినాశ్ అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. పెళ్లి తర్వాత తన భర్త, తండ్రిని ఆమె తన అభిమానులకు పరిచయం చేసింది. ఈ వీడియోను వీ3 న్యూస్ ఛానల్ అద్భుతంగా కవర్ చేసిందని కితాబిచ్చింది. స్వాతి నాయుడికి తెలుగు పోర్న్ స్టార్ గా గుర్తింపు ఉంది. అంతేకాదు టీవీ ఛానళ్లలో ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలకు ఆమె హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.
swathi naidu
marriage

More Telugu News